AP: మున్సిపాలిటీల్లోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమేన తాగునీరు అందిస్తామని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. రూ.5 వేల కోట్లతో నగరాల్లో పక్కా డ్రెయిన్లు నిర్మిస్తామన్నారు. కేంద్ర నిధులు రూ.4 వేల కోట్లతో తాగునీరు, డ్రెయిన్లు, రోడ్లు, లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై రైట్స్ సంస్థ సర్వే చేయిస్తోందన్నారు. నివేదిక వచ్చిన తర్వాత ప్రాజెక్టు చేపడుతామన్నారు.