KMR: రాష్ట్ర ముదిరాజ్ సంఘం తలపెట్టిన ‘హలో ముదిరాజ్ ఛలో గాంధీ భవన్’ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తుగా ముదిరాజ్ సంఘం నాయకులను అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం నాలుగు గంటల నుంచి నాయకుల ఇండ్ల వద్దకు వెళ్లి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు చింతల నీలకంఠం హైదరాబాద్ వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.