KDP: కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర 12వ డివిజన్లో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. డ్రైనేజీ పనులకు ఆటంకంగా ఉన్న విద్యుత్ స్తంభాల మార్పిడి అత్యవసరమని తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో కలిసి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అవసరమైన ప్రాంతాల్లో వెంటనే స్తంభాల మార్పిడి చేయాలని సూచించారు.