HNK: సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎవరికీ ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నాగరాజు హెచ్చరించారు. కాజీపేటలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రస్తుతం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు.