BDK: భద్రాద్రి జిల్లాలోని నిరుద్యోగులకు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరాం శుభవార్త చెప్పారు. పాల్వంచలోని ప్రైవేట్ సంస్థలు 25 సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. టెన్త్ పాసై, 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న పురుష అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఈనెల 26న చుంచుపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.