NLG: నాగార్జునసాగర్ (నందికొండ) మున్సిపాలిటీ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర సరిహద్దుకు ఆనుకుని ఉండడంతో గంజాయి, డ్రగ్స్, పేకాట దందాలు, వ్యభిచారం వంటి కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఇవి యువతపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని ఆందోళన చెందుతున్నారు.