NLG: నడికుడలో ‘బడిబాట’ కార్యక్రమం నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో యూకేజీ తరగతులు ప్రారంభమవుతాయని ప్రధానోపాధ్యాయులు నారాయణ రెడ్డి తెలిపారు. ప్రైవేటుకు ధీటుగా నాణ్యమైన విద్యతో పాటు ఉచిత భోజనం, పుస్తకాలు, యూనిఫామ్స్ అందిస్తామని వివరించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కోరారు.