Farooq Abdullah: పాకిస్థాన్ గాజులు తొడుక్కుని లేదు
పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా స్పందించారు.
Farooq Abdullah: పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్న విషయం తెలిసిందే. అయితే జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. పాకిస్థాన్ దేశం గాజులు తొడుక్కుని లేదు. ఆ దేశం దగ్గర అణు బాంబులు ఉన్నాయి. దురదృష్టవశాత్తు అవి మనమీద పడితే పరిస్థితి ఏంటని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు.
భారత్‌లో భాగం కావాలని పీవోకే ప్రజలు కోరుకుంటున్నారని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి భారత్‌లో తాము భాగం కావాలని పీవోకే ప్రజలు కోరుకుంటున్నారని రాజ్‌నాథ్ తెలిపారు. వాళ్లంతట ప్రజలే భారత్‌లో భాగం కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి పీఓకేను బలవంతంగా భారత్‌లో కలపాల్సిన అవసరం లేదని రాజ్‌నాథ్ అన్నారు.