సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తీ నటించిన చిత్రం ‘యుగానికి ఒక్కడు’. ఇందులో ఆండ్రియా, రీమాసేన్ హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ సీక్వెల్ ప్రచారంపై ఆండ్రియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సెల్వరాఘవన్ చెప్పిన టైమింగ్ ప్రకారం ఏదీ జరగదని.. ఈ మూవీ షూటింగ్ సమయంలో తాను పడ్డ ఇబ్బందులు వర్ణనాతీతమంటూ పేర్కొంది. మళ్లీ ఆయనతో సినిమా చేయడం తన వల్ల కాదని చెప్పుకొచ్చింది.