»Rahul Gandhi Prime Minister Waives Off Lakhs Of Crores Of Loans Taken By His Billionaire Friends
Rahul Gandhi: తన బిలియనీర్ స్నేహితులు తీసుకున్న లక్షల కోట్ల రుణాలను ప్రధాని మాఫీ చేశారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పున:పంపిణీ చేస్తామని కాంగ్రెస్ చెబుతుందని మోదీ తీవ్ర్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Rahul Gandhi: Prime Minister waives off lakhs of crores of loans taken by his billionaire friends
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన మేనిపేస్టోలో హామీ తీవ్ర దుమారం రేపింది. ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పున:పంపిణీ చేస్తామని కాంగ్రెస్ చెబుతుందని మోదీ తీవ్ర్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు. సర్వే తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పలేదు. ఈ దేశంలో ఎంతమందికి అన్యాయం జరిగిందనే దాని గురించి తెలుసుకునేందుకు సర్వే చేస్తామని అంటున్నాం.
అన్యాయం గురించి మాట్లాడితే మోదీ ఎలా స్పందించారో? దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నామంటూ నిందలు వేస్తున్నారు. దేశ భక్తులని అనుకునే వాళ్లు సామాజిక-ఆర్థిక సర్వేతో కూడిన కులగణనకు భయపడుతున్నారని రాహుల్ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి నిర్ణయం దీనిపై ఉంటుందన్నారు. దేశంలో అన్యాయానికి గురైన 90 శాతం మందికి న్యాయం కల్పించడమే తమ జీవిత ధ్యేయమని తెలిపారు. ప్రధాని తన బిలియనీర్ స్నేహితులు తీసుకున్న రూ.16లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని ఆరోపించారు.
దేశం ఎప్పటికీ ఆయన్ని క్షమించదని తెలిపారు. రూ.16 లక్షల కోట్ల డబ్బుతో 16 కోట్ల మంది యువతకు ఏడాదికి లక్ష జీతంతో ఉద్యోగాలు ఇవ్వచ్చు. 16 కోట్ల మంది మహిళలకు ఏడాదికి రూ.లక్ష ఇస్తే వాళ్ల జీవితాలు మారిపోయేవి. రైతులకు రుణమాఫీ చేస్తే ఆత్మహత్యలను అరికట్టేవాళ్లం. దేశం మెత్తానికి 20 ఏళ్ల పాటు రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వచ్చు. దేశంలోని పౌరుల బాధలు తీర్చడానికి బదులు ప్రధాని తమ స్నేహితులకు లాభం చేకూర్చారని రాహుల్ మోదీపై మండిపడ్డారు.