HNK: హనుమకొండలోని కనకదుర్గ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రెష్ మిల్క్ డెయిరీ ఔట్ లెట్‌ను ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. స్థానికంగా నాణ్యమైన పాలు, పాలు ఉత్పత్తులు అందుబాటులోకి రావడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, ప్రజలకు శుద్ధమైన, నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడంలో ఇలాంటి డెయిరీ ఔట్లెట్ల పాత్ర కీలకమన్నారు.