సత్యసాయి: మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు వ్యక్తిగత సహాయకుడు రవికుమార్ తండ్రి, విశ్రాంత ఉపాధ్యాయులు వీ.ఎన్. అంజినప్ప అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అంజినప్ప నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పుత్రశోకంతో ఉన్న రవికుమార్‌ను, కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.