AKP: పాయకరావుపేట మేజర్ పంచాయతీ మార్కెట్లో రోజువారీ ఆశీలు వసూళ్లకు వేలంపాట స్థానిక పంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించినట్లు పంచాయతీ కార్యదర్శి శివరామ్ తెలిపారు. 2026-27 సంవత్సరానికి డైలీ మార్కెట్ వేలంపాట రూ.8.28 లక్షలకు ఖరారు అయినట్లు తెలిపారు. చేపల మార్కెట్ వేలంపాట రూ.1,19,200, మేకల కబేళాలలో ఆశీలు వసుళ్ళకు వేలంపాట రూ.80,000కు ఖరారైంది.