TG: CM రేవంత్‌పై ఎమ్మెల్సీ శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో రౌడీ రాజ్యం నడుస్తోందన్నారు. కేసీఆర్ క్యాంప్ ఆఫీసుపై దాడి దారుణమని మండిపడ్డారు. సీఎం రేవంత్ ఫొటో పెట్టకపోతే దాడి చేస్తారా అని నిలదీశారు. దాడికి కారకులైన సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3 మున్సిపాలిటీల్లో ఓటమిని తట్టుకోలేకే కాంగ్రెస్ దాడులు చేస్తుందని విమర్శించారు.