BDK: దమ్మపేట మండలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా మండల కేంద్రంలో పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఇటీవలే మరణించిన పలు కుటుంబాలను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అలాగే పలువురుని కలిసి సమస్యలు అడిగే తెలుసుకున్నారు.