TG: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక కాసేపట్లో జరగనుంది. ముందుగా సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. తర్వాత మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఎన్నిక నేపథ్యంలో 850 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు డీసీపీలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.