HYD: ఆసిఫ్ నగర్ ఫ్రూట్ గోదాం పై H-FAST అధికారులు దాడులు నిర్వహించారు. మామిడి పండ్లను ‘ఇథలీన్’ వంటి రసాయనాలతో కృత్రిమంగా మక్కపెడుతున్నట్టు బయటపడింది. గోదాంలో సుమారు 7 టన్నుల మామిడిపండ్లు స్వాధీనం చేసుకున్నారు. బాటసింగారం మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన ఈ పండ్లను అక్రమంగా మార్కెట్కు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.