PPM: ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన జరగనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మజీ రావు తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పార్వతీపురం పట్టణంలోని DVMM హై స్కూల్ (చర్చ్ వీధి), గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ (డిగ్రీ కాలేజ్ ఎదురుగా)లో ఈ మూల్యాంకన ప్రక్రియ నిర్వహించబడుతుందని అన్నారు.