WGL: ఉపాధి హామీ పనుల నిధుల కేటాయింపులో వివక్ష చూపడం అనైతికమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిచిన గ్రామాలకు EGS నిధులను నిలిపివేయడాన్ని ఖండిస్తున్నామని, అన్ని గ్రామాలకు సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధికి దోహదపడాలని మాజీ ఎమ్మెల్యే కోరారు.