WNP: వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల సబ్స్టేషన్లో నిర్వహణ పనుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కేడీఆర్ నగర్, నాగరాజు ఆస్పత్రి రోడ్డు, కేడీఆర్ పార్క్, బొందలగడ్డ ప్రాంతాల్లో కరెంట్ ఉండదని ఏఈ సుధాకర్ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.