HNK: ఐనవోలు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ గ్రూపులో 40 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఎస్ఓ కోటగిరి సునీత ఇవాళ తెలిపారు. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థినులు ఈనెల 15లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 3న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.