WGL: ఖిలా వరంగల్ ఏబీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను జిల్లా కలెక్టర్ సత్య శారద సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల సౌకర్యాలు, బోధన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.