రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. 15 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల కలెక్టర్ భారతి హొళికెరిని మహిళా శిశు సంక్షేమశాఖ స్పెషల్ సెక్రెటరీగా నియమించారు. హన్మకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతును నిజామాబాద్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. అమయ్‌కుమార్‌ను మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్‌గా నియమించడమే గాక హైదరాబాద్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను హన్మకొండ కలెక్టర్‌గా, కుమ్రంభీం కలెక్టర్ రాహుల్ రాజ్‌ను ఆదిలాబాద్ కలెక్టర్‌గా పంపించారు. నారాయణరెడ్డిని వికారాబాద్ కలెక్టర్‌గా, వనపర్తి కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషాను కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టర్‌గా, జగిత్యాల జిల్లా కలెక్టర్ రవిని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్‌గా, కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌కు జగిత్యాల కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. బదావత్ సంతోష్ మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. మెదక్ కలెక్టర్ ఎస్ వెంకట్రావును సూర్యాపేట కలెక్టర్‌గా, ఎస్ హరీశ్‌ను రంగారెడ్డి, రాజశ్రీ షాను మెదక్ కలెక్టర్‌గా నియమించారు. మహబూబ్‌నగర్ అడిషనల్ కలెక్టర్ తేజ ఎస్ పవార్ వనపర్తి కలెక్టర్‌గా, ఉట్నూరు ఐటీడీఏ పీవో క్రాంతి వరుణ్‌రెడ్డి నిర్మల్ కలెక్టర్‌గా నియమించారు.