NRPT: నారాయణపేటలోని ఆనంద నిలయం, ఎస్సీ బాలుర సంక్షేమ హాస్టల్ ను బుధవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తనిఖీ చేశారు. వంట గదిలోని సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల గదులను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.