SRPT: జిల్లాలో ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. 69 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అదనపు బస్సులు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, ప్రశ్నపత్రాల తరలింపులో పటిష్ట భద్రత పాటించాలని అన్నారు.