KRNL: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మండల కన్వీనర్ విజయ్ భాస్కర్ గౌడ్, సర్పంచ్ నాగరాజు గౌడ్ పిలుపునిచ్చారు. “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో భాగంగా దేవనకొండ మండలం నేలతలమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో పారిశుధ్య పనులు నిర్వహించారు. పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రపరిచి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు.