NRML: కుంటాల మండల కేంద్రంలో ఈరోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించి, అమ్మవారిని వైభవంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా భక్తులు మొక్కులు తీర్చుకుని ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.