WGL: నగరంలోని ప్రతి వీధిలోనూ అపరిశుభ్రంగా ఉన్న మురుగు కాలువలు దర్శనమిస్తున్నాయి. బల్దియా సిబ్బంది సకాలంలో కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. మురుగు నీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని, జవాన్లు కూడా వీటిపై నిఘా పెట్టడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువలను శుభ్రం చేయాలని WGL వాసులు డిమాండ్ చేస్తున్నారు.