కరీంనగర్లోని బైపాస్ రోడ్డులో నిన్న అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులను బలితీసుకుంది. బొమ్మకల్ ఫ్లైఓవర్ సమీపంలో ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో సయ్యద్ అబ్దుల్ రెహమాన్, సయ్యద్ అతియాబ్ హుస్సేన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉండగా, మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనపై మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది.