MDK: రామాయంపేట మండల కేంద్రంలో హనుమాన్ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. పట్టణ పురవీధుల్లో నిర్వహించిన శోభాయాత్రలో సోను గ్యాస్ మాస్టర్ కుమారుడు వాల్మీకి విరాట్ వేసిన హనుమాన్ వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారి విరాట్ అచ్చం ఆంజనేయుడిలా ముస్తాబై భక్తులను అలరించాడు. భక్తి శ్రద్ధల మధ్య సాగిన ఈ శోభాయాత్రలో పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.