NLG: జిల్లాలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో వివిధ అంశాలపై వర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ నిన్న ముఖాముఖి చర్చించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ సమస్యలను నేరుగా చర్చించే ప్రజాస్వామిక వాతావరణం ఉందన్నారు. సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కారం దిశగా స్పందించడం జరుగుతుందని తెలిపారు.