BDK: టేకులపల్లిలోని బేతంపూడి వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కోరం కనకయ్య గురువారం ప్రారంభించారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా, రైతులు తమ పంటను నేరుగా ప్రభుత్వ కేంద్రాల్లోనే అమ్ముకుని గిట్టుబాటు ధర పొందాలని సూచించారు.