SRCL: వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం జోడు హనుమాన్ దేవాలయంలో గురువారం చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ప్రభుత్వ విప్ కు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.