ASF: ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని SC రిజర్వేషన్‌గా చేయాలని తెలంగాణ దళిత యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఈర్ల సునీల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో AO కిరణ్‌కి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో SC వర్గానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. SCలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం చాలా అవసరమన్నారు.