»Bhatti Vikramarka Rythu Bandhu Does Not Apply To These
Bhatti Vikramarka: వీటికి రైతుబంధు వర్తించదు
రైతుబంధును గత ప్రభుత్వం ఎలాంటి భూమికైన ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తోంది. కొండలు, గుట్టలు, రోడ్లకు రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.
Bhatti Vikramarka: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ప్రకటించింది. ఇందులో నాలుగు పథకాలను ప్రారంభించారు. అయితే ప్రస్తుతం రైతుబంధు పథకం అమల్లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం కింద రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.15వేలు ఇస్తామన్నారు. కానీ ప్రస్తుతం ఈ ఏడాదికి మాత్రం పాత రైతుబంధఉ పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఈ రైతుబంధును గత ప్రభుత్వం ఎలాంటి భూమికైన ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తోంది. కొండలు, గుట్టలు, రోడ్లకు రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. కానీ ప్రస్తుతం పాత డేటా ప్రకారమే ఇస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళను మహాలక్ష్మిగానే భావించి గౌరవిస్తున్నాం. మేం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. స్వయం సహాయక బృందాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మార్చి 12న మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని ప్రారంభించనున్నాం. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి వారికి అవకాశం కల్పిస్తాం. గత ప్రభుత్వం ఎప్పుడూ మొదటివారంలో జీతాలు ఇవ్వలేదు. కానీ మా ప్రభుత్వంలో మార్చి 1న జీతాలు ఇచ్చామని భట్టి తెలిపారు.