అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ ఫార్మా రంగానికి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే కొన్ని రకాల ఔషధాలపై ఏకంగా 100 శాతం టారిఫ్లు విధించే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో భారత ఫార్మా రంగ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, బయోకాన్ వంటి ప్రధాన కంపెనీల షేర్లు పడిపోయాయి.