ప్రకాశం: కొండపి మండలం ముప్పవరంలో పశువుల సామాజిక భవనానికి మంత్రి స్వామి గురువారం శంకుస్థాపన చేశారు. రూ.10 లక్షల రూపాయల నిధులతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో గ్రామాలలో కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధికి చిరునామాగా కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని పేర్కొన్నారు.