AP: రాజధాని రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తుందనే దానిపై బిల్లులో స్పష్టత లేదని YCP నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ‘రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. APకి ప్రత్యేక హోదా విషయంపై బిల్లులో ప్రస్తావన లేదు. దీనిపై YCP మాత్రం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. వేలకువేల ఎకరాలు తీసుకున్నారు.. అభివృద్ధి చేయలేదు’ అని విమర్శించారు.