సత్యసాయి: గోరంట్ల మండలం గౌనివారిపల్లిలో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గురువారం పరిశీలించారు. గ్రౌండ్ ట్రూతింగ్ పనులను రికార్డులతో సరిపోల్చిన ఆయన.. నోటీసులు అందిన రైతులు తప్పని సరిగా సర్వే సమయంలో హాజరై హద్దులు చూపాలని సూచించారు. అధునాతన రోవర్లు, సాంకేతికతతో భూవివాదాలు లేని రికార్డులు రూపొందుతాయని వివరించారు.