NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో సర్పంచ్ బత్తుల లక్ష్మీప్రసన్న నరసింహ అధ్యక్షతన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ గ్రామసభ జరిగింది. జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, సూపరింటెండెంట్ మనోహర్ పాల్గొని ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఉప సర్పంచ్ ఆకుల కృష్ణ, వార్డు సభ్యులు, కార్యదర్శి కృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.