SDPT: చేర్యాల పాత బస్టాండ్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆకునూర్ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని కీర్తన తీవ్రంగా గాయపడింది. తన తాతతో కలిసి టీవీఎస్ ఎక్స్ఎల్పై వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన కీర్తనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.