KMM: ఉమ్మడి జిల్లాలో మద్యం విక్రయాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. గతేడాది రూ. 2,025 కోట్లుగా ఉన్న విక్రయాలు, ఈసారి ఏకంగా రూ. 2,297 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025-26లో అమ్మకాలు పెరిగాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మార్చి 31 నాటికి ఒక్క వైరా డిపో నుంచి రూ. 24.20 కోట్ల మేర మద్యం సరఫరా కావడం గమనార్హం.