ELR: నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, దీనిపై పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందడం అత్యంత కీలకమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బుధవారం జంగారెడ్డిగూడెంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ నిర్ణయం తర్వాతే విభజన ప్రక్రియ ఒక కొలిక్కి వస్తుందని వివరించారు. జంగారెడ్డిగూడెం ప్రాంతానికి దక్కే ప్రాధాన్యతపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు.