BPT: పర్చూరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పథకాలపై గురువారం ఉదయం 10:30 గంటలకు స్థానిక రోటరీ భవనంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు క్యాంపు కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఆరు మండలాలకు సంబంధించిన MRO, ఎంపీడీవోలు, నాయకులు హాజరు కావాలని వారు సూచించారు.