రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి రైతులకు ఫిబ్రవరిలో అందాల్సిన రూ.2000 నగదు ఇంకా అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే మార్చి నెలాఖరు నాటికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.