AP: రాష్ట్రంలోని కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయా(KGBV)ల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 11 తరగతుల్లో ప్రవేశాలు.. 7,8,9,10,12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి గడువు నిన్నటితో ముగిసింది. అయితే విద్యార్థులు, పేరెంట్స్ అభ్యర్థన మేరకు గడువు పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు.