KMM: ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ రాములు తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన నిపుణులైన వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని రోగులకు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేయనున్నారు. వైద్య సేవలు పొందగోరే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు, ఫోన్ నంబరు వెంట తీసుకురావాలని ఆయన సూచించారు.