NDL: శ్రీశైల శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి అమ్మవార్లకు బుధవారం రాత్రి పల్లకి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పౌర్ణమి గడియలు రావడంతో దేవస్థానం శ్రీ స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవాన్ని జరిపించారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సేవ సంకల్పాన్ని పఠించి మహాగణపతి పూజ అనంతరం శ్రీ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో వేంచేబు చేయించి పూజలు అందించారు.