NGKL: నేడు జరగాల్సిన రాష్ట్ర మంత్రుల పర్యటన అనివార్య కారణాల వల్ల రద్దయినట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఓ ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్ ప్రకారం, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ కాగా జూపల్లి కృష్ణారావు గారు అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మద్దిమడుగు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించాల్సి ఉంది.