కృష్ణా: బాపులపాడు మండలం కాకులపాడు గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ, కట్టుబడి పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.